మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన “ కన్నప్ప” సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి.. పాన్ ఇండియా వైడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంతటి క్రేజ్ రావడానికి కారణం ప్రభాస్.. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.. మంచు విష్ణు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నా కానీ ఆయనకు పాన్ ఇండియా వైడ్ మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాపై బజ్ ఏర్పడలేదు..దీనితో మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఇతర ఇండస్ట్రీ ల నుండి స్టార్స్ తీసుకోని ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు..
SSMB : సరికొత్త మహేష్ ని చూస్తారు.. విజయేంద్రప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడి పాత్ర పోషిస్తున్నారు.. చందమామ కాజల్ అగర్వాల్ పార్వతిదేవిగా నటిస్తుంది.. అయితే ముందుగా ఈ సినిమాలో శివుడి పాత్ర ప్రభాస్ చేస్తున్నాడని న్యూస్ వైరల్ అయింది.. కానీ ఆ పాత్ర అక్షయ్ కుమార్చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి రోల్ చేస్తున్నాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు..తాజాగా కన్నప్ప మేకర్స్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ “రుద్ర” అనే పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లుగా వారు వెల్లడించారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ ను మేకర్స్ షేర్ చేశారు.
అయితే ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విగ్ అస్సలు సెట్ కాలేదని వారు కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే ప్రభాస్ లుక్ మార్చాలని మంచు విష్ణుకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.