యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు.. ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ “ సాయి పల్లవి” హీరోయిన్ గా నటించింది.. గత కొంత కాలంగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి నాగ చైతన్యతో గతంలో ప్రేమమ్, సవ్య సాచి వంటి సినిమాలు తెరకేక్కించాడు.. ఆ రెండు మంచి విజయం సాధించాయి..దీనితో వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ “ తండేల్ “ సైతం ఎంతగానో ఆకట్టుకుంటుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా వున్నారు.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..
ఎన్టీఆర్ – నీల్ మూవీ సంక్రాంతి రిలీజ్ కష్టమేనా..?
ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన మూడు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ముఖ్యంగా “ బుజ్జి తల్లి “ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ మారింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కింది.. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నపూర్ణ స్టూడియో లో గ్రాండ్ గా జరుగుతుంది.. ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నారు.. అయితే ఈ ఈవెంట్ కి ఆడియన్స్ కి ప్రవేశం లేదు..
హెవీ క్రౌడ్ వచ్చే అవకాశం ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ చేసారు.. ఫిబ్రవరి 7 న రిలీజ్ అయ్యే “ తండేల్ “ సినిమాను లవర్స్ రిపీటెడ్ గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేసారు.. ప్రస్తుతం ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..