MOVIE NEWS

ఎన్టీఆర్ – నీల్ మూవీ సంక్రాంతి రిలీజ్ కష్టమేనా..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు..

నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..?

NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ అలాగే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్‌ 31వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్స్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదకు రానుంది…తాజాగా ఎన్టీఆర్ కూడా హైదరాబాద్‌ కి వచ్చేయడంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ టీం ఫస్ట్ షెడ్యూల్ మొదలెట్టెందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే అనౌన్స్ చేశారు.

కానీ వార్ 2 కారణంగా అనుకున్న సమయం కంటే కాస్త లేట్‌గా ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. కేవలం 11 నెలల్లో ఎన్టీఆర్-నీల్ ఈ సినిమాను పూర్తి చేస్తేనే సంక్రాంతి రిలీజ్ ఉంటుంది…అయితే ఇంత తక్కువ వ్యవధిలో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయడం అసాధ్యం.. ఈ లెక్కన చూస్తే ఎన్టీఆర్ నీల్ మూవీ సంక్రాంతికి రావడం కష్టమే…

Related posts

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

murali

చరణ్ ని ఆటపట్టించిన బాలయ్య.. వీడియో వైరల్..!!

murali

ఆ స్టార్ హీరోతో మరో భారీ ప్రాజెక్టు..లక్కీ ఛాన్స్ కొట్టేసిన నాగవంశీ..?

murali

Leave a Comment