MOVIE NEWS

తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ సమర్పణలో బన్నీవాసు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ మూవీని మేకర్స్ ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు..ఈ నేపథ్యంలోనే మేకర్స్ తండేల్ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు… రేపు తండేల్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. “తండేల్ జాతర” పేరుతో మేకర్స్ ఈ మ్యూజికల్ నైట్ ను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా ఈ ఈవెంట్ వేదిక కూడా ఖరారైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈవెంట్ జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి కావడంతో పోలీస్ పర్మిషన్స్ కోసం మేకర్స్ కష్టపడ్డారు..

విశ్వంభర : ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..?

పుష్ప 2 స్పెషల్ షో చూసేందుకు అల్లుఅర్జున్ ఫ్యామిలీతో సంధ్య థియేటర్ కి వెళ్లగా అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన సంచలనంగా మారింది.. అప్పటి నుంచి పోలీసులు భారీ ఈవెంట్ లకు పర్మిషన్ ఇవ్వడం లేదు.. కొద్ది మంది ప్రముఖులతోనే ఈవెంట్ జరుపుకోవాలని వారు సూచిస్తున్నారు.

రేపు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ వచ్చేందుకు అనుమతి నిరాకరించారు.దీనితో కేవలం కెమెరాలతో మాత్రమే లైవ్ ఇవ్వనున్నారు.దాదాపు ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని అడ్డంకులు తొలగడంతో ఈవెంట్‌ను సక్సెస్ చేసేందుకు నిర్వహకులు ప్రయత్నిస్తున్నారు.అల్లుఅర్జున్ సైతం ఇక భారీ ఈవెంట్స్ కి దూరంగా ఉండనున్నారు.. సంధ్య థియేటర్ ఘటనతో అల్లుఅర్జున్ పర్సనల్ గా డిస్టర్బ్ అయ్యారు.. పుష్ప 2 సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు..ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చేందుకు తాను తరువాత చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టారు..

 

Related posts

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

murali

ట్రిపుల్ ధమాకా కి సిద్దం అవ్వండి రెబల్ ఫ్యాన్స్

filmybowl

ఇట్స్ మీనాక్షి టైం

filmybowl

Leave a Comment