మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “భోళా శంకర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో తరువాత సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బింబిసారా ఫేమ్ “వశిష్ఠ” డైరెక్షన్ లో ‘విశ్వంభర’ అనే బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ప్రస్తుతం మెగాస్టార్ ఈ సినిమాతో బిజీగా ఉన్నారు.నిజానికి ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది.అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
SSMB : సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్న జక్కన్న.. అప్పుడే రెండో షెడ్యూల్..?
మేకర్స్ ఈ సినిమాను మే’ 9’ న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.. ఆ తేదీన మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ “ జగదేకవీరుడు అతిలోక సుందరి” సినిమా రిలీజ్ అవ్వడంతో మేకర్స్ ఆ తేదీనే ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం..బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు..క్యూట్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..విశ్వంభర మూవీ ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది.
రీసెంట్ గా కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయిందని డైరెక్టర్ వశిష్ట అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. వశిష్ట పోస్ట్ తర్వాత ఈ సినిమా మ్యూజిక్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో విశ్వంభర ఫస్ట్ సింగిల్ పై తాజాగా బజ్ వినిపిస్తోంది.ఆల్రెడీ విశ్వంభర ఫస్ట్ సింగిల్ వర్క్ మొదలైందని సమాచారం., శివరాత్రి కానుకగా ఆ సాంగ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం..