MOVIE NEWS

తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా.. కారణం అదేనా..?

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు.. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..

ఓటిటిలో “పుష్ప 2” కి సూపర్ రెస్పాన్స్.. టాప్ లో ట్రెండింగ్..!!

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలు క్రియేట్ చేసేశాయి. దానికి తోడు ఈ సినిమాలో నాగచైతన్య సరసన న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది..గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “లవ్ స్టోరీ “ సూపర్ హిట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి ..రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమాను మేకర్స్ ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్నారు..ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు..

చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ రాబోతున్నట్లు అఫీషియల్ గా కూడా ప్రకటించారు.ఈ ఈవెంట్  ఫిబ్రవరి 1 అంటే నేడు గ్రాండ్ గా జరగాల్సి వుంది..కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్నీ మేకర్స్ రేపటికి పోస్ట్ ఫోన్ చేశారు. దీని గురించి మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు… ఈరోజు జరగాల్సిన ఐకానిక్ తండేల్ జాతర ఫిబ్రవరి 2కి మార్చబడింది.ఈవెంట్ చాలా మరపురాని క్షణాలతో, గొప్పగా వైభవంగా ఉండబోతుంది. ఈ సారి గురి తప్పేదేలే.. అంటూ మేకర్స్ పోస్టర్ లో పెర్కోన్నారు

 

Related posts

మంగళవారం డైరెక్టర్ కే ఎందుకిలా….

filmybowl

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 2 : ట్రైలర్ లో ఈ సీన్స్ గమనించారా..సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా ..!!

murali

Leave a Comment