MOVIE NEWS

బాలయ్యకు తారక్ అభినందనలు.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డ్ వరించింది.. గణతంత్ర దినోత్సవం సందర్బంగా పద్మ అవార్డలని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కళల విభాగంలో బాలయ్యకి పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. సినీ రంగ పరిశ్రమలో బాలయ్య విశేషకృషికి సరైన గౌరవం దక్కిందని ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.. బాలయ్య ఇటీవలే 50 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి చేసుకున్నారు.. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో బాలయ్య 109 చిత్రాల్లో హీరోగా నటించారు.. బాలయ్య తన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్ హిట్స్ ని అందుకున్నారు..విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య నటన పరంగా తండ్రి కి తగ్గ తనయుడిగా అద్భుతంగా రాణించారు..

నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!!

ప్రస్తుతం బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద వున్నారు.. వరుస సక్సెస్ లు అందుకుంటూ బాలయ్య యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.. ఇదిలా ఉంటే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ బాండింగ్ ఎంతో ప్రత్యేకం.. తన అన్న హరికృష్ణ చిన్న కొడుకు తారక్ అంటే బాలయ్య కి ఎంతో ఇష్టం.. కానీ ఆ ఇష్టం బయటవారికి అంతగా కనిపించక పోవచ్చు గాని బాలయ్యకి వారంతా ఎంతో ప్రేమ అని ఆయన సన్నిహితులు చెబుతూ వుంటారు.. తారక్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయినప్పుడు బాలయ్య ఎంతో సపోర్ట్ చేసారు.. తన తండ్రి ఎన్టీఆర్ లా తారక్ అద్భుతంగా డైలాగ్స్ చెబుతుంటే బాలయ్య ఎంతగానో మురిసిపోయేవారు.. చప్పట్లు, విజిల్స్ తో తన ఆనందాన్ని వ్యక్తం చేసేవారు..తన అన్న నందమూరి హరికృష్ణ చనిపోయినపుడు తారక్ కు, కల్యాణ్ రాం కి పెద్ద దిక్కుగా బాలయ్య నిలబడ్డారు.. కానీ ఈ సోషల్ మీడియా కారణంగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది..

అలాగే ఎన్టీఆర్ కి బాలయ్య రాజకీయంగా, సినిమా పరంగా ఎదుగుదల లేకుండా చేస్తున్నారని కొంత మంది ఫేక్ ప్రచారం చేసారు.. కానీ తాజాగా బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించడంతో ఎన్టీఆర్ తన బాల బాబాయ్ కి అభినందనలు చెబుతూ చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతుంది..పద్మభూషణ్ అవార్డ్ లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్.. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది అంటూ ట్వీట్ చేసారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఎన్టీఆర్ ట్వీట్ తో నందమూరి అభిమానులు ఎంతో సంతోషంగా వున్నారు..

 

Related posts

పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?

murali

హమ్మయ్య పుష్ప పార్ట్ 3 పై క్లారిటీ వచ్చేసింది.. టైటిల్ అదిరిందిగా..!!

murali

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

murali

Leave a Comment