MOVIE NEWS

నటసింహం బాలయ్యకు పద్మభూషణ్ అవార్డ్..ఆనందంలో ఫ్యాన్స్..!!

నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నటుడుగా 50 సంవత్సరాల కెరీర్ ను బాలయ్య పూర్తి చేసుకున్నారు.. బాలయ్య ఈ 50 సంవత్సరాల సినీ కెరీర్ 109 సినిమాలలో నటించాడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలయ్య ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, క్లాసిక్ హిట్స్, బ్లాక్ బస్టర్ సినిమాలను అందించాడు.. బాలయ్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు..విశ్వవిఖ్యాత నందమూరి తారాకరామారావు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య తండ్రితో కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు..నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..

తండేల్ : ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ అదిరిందిగా..!!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లకు పోటీగా బాలయ్య అప్పట్లో వరుస విజయాలు అందుకున్నారు.. వయసు 60 దాటినా కూడా బాలయ్య ఇప్పటికీ అదే జోరుతో సినిమాలు చేస్తున్నారు.. ప్రస్తుతం యంగ్ హీరోలకు సైతం బాలయ్య పోటీని ఇస్తున్నారు.. గత కొంత కాలంగా వరుస సక్సెస్ లతో బాలయ్య ఫుల్ జోష్ మీద వున్నారు.. సినిమాల పరంగానే హోస్ట్ గా కూడా బాలయ్య అదరగొడుతున్నాడు.. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవుతున్న అన్ స్టాప్పబుల్ షో కి బాలయ్య హోస్ట్ గా చేస్తున్నారు.. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి కాగా తాజాగా నాలుగో సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది..

ఇదిలా ఉంటే బాలయ్య తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు..హిందూపురం ఎమ్మెల్యే గా వరుసగా మూడు సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచి బాలయ్య చరిత్ర సృష్టించారు.. అంతే కాకుండా తల్లి పేరు మీద బసవతారాకం క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతూ ఎంతో మందికి మంచి వైద్యం అందిస్తున్నారు.. బాలయ్య సేవలకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆయనకు పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులని ప్రకటించిన కేంద్రం బాలయ్య కి కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డ్ ని ప్రకటించింది.. తమ అభిమాన హీరోకి పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు..

 

Related posts

ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!!

murali

మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..?

murali

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

murali

Leave a Comment