MOVIE NEWS

మీమర్స్ కి మంచి స్టఫ్ ఇచ్చిన రాజమౌళి.. మీమ్స్ తో తెగ రచ్చ చేస్తున్నారుగా..!!

సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “ ఎస్ఎస్ఎంబి “.. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే మహేష్ ఈ సినిమాకోసం తన లుక్ ని చేంజ్ చేసుకునే పనిలో వున్నారు.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేయడంతో రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు.. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా గ్రాండ్ పూజా కార్యక్రమం జరిగింది.. కానీ ఇది ఎంతో సీక్రెట్ గా జరిగింది.. మహేష్ లుక్ ఎవరు చూడకుండా రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్లాన్ చేసాడు..ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..

మహేష్ పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

ఈ సినిమా షూటింగ్ ఎప్పుదు మొదలవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూసారు.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ భారీ సెట్ వేసి ఈ సినిమా షూట్ నిర్వహించారు.. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు.. మహేష్ పాస్ పోర్ట్ లాగేసుకున్న అంటూ సింహాన్ని జైలులో బందించినట్లుగా రాజమౌళి చిన్న వీడియో గ్లింప్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.. దీనికి మహేష్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ రిప్లై ఇచ్చారు.. అలాగే స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా సైతం ఫైనల్లీ అని రిప్లై ఇచ్చింది.. దీనితో ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది..

అయితే రాజమౌళి పోస్ట్ తో మీమర్స్ కి మంచి స్టఫ్ దొరికింది..సోషల్ మీడియా అంతా.. మహేశ్‌, రాజమౌళి సినిమాకు సంబంధించిన పోస్టులు, మీమ్స్‌తో సందడి చేస్తున్నారు..జులై సినిమాలో బ్రహ్మీ క్లిప్ ని మహేష్, రాజమౌళి తో కలిపి ఫన్నీ గా క్రియేట్ చేసారు.. ప్రస్తుతం ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

 

Related posts

మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి గారే.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!!

murali

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

filmybowl

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

Leave a Comment