MOVIE NEWS

మహేష్ పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “ గుంటూరు కారం “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ మంచి గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది..ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ లో జరుగుతుంది.

సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సింహాన్ని బంధించి మహేష్ బాబు పాస్ పోర్ట్ తన దగ్గర పెట్టుకున్నట్టు ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసాడు. మహేష్ రెగ్యులర్ గా విదేశాలకు వెళ్తాడని అందరికి తెలిసిందే. అందుకే తన పాస్ పోర్ట్ ని రాజమౌళీ దాచి పెట్టుకొన్నట్లుగా ఇక మహేష్ ని ఎక్కడికి వెళ్ళనిచ్చేది లేదు అని రాజమౌళి హింట్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీంతో ఇకపై ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది అని తెలుస్తుంది.

అయితే రాజమౌళి పెట్టిన పోస్ట్ కి మహేష్ బాబు.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి మహేష్ మూవీ గురించి చిన్న అప్డేట్ ఇచ్చి సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చారు… SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతుంది.

Related posts

విశ్వంభర : మెగాస్టార్ మూవీ సమ్మర్ కి కూడా కష్టమేనా..?

murali

NC24 : నాగచైతన్య కొత్త సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..?

murali

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment