MOVIE NEWS

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఆయన నుంచి సినిమా వచ్చిందంటే యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టేవారు.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆర్జివీ తెరకెక్కించే మూవీ ట్రెండ్ సెట్ చేసాయి.. ఆయన తెరకెక్కించిన “శివ” మూవీ.. నాగార్జున కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.. శివ సినిమాతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది.. అంత గొప్ప సినిమా ఇచ్చిన ఆర్జివీ ఆ తరువాత సత్య, క్షణ క్షణం, రంగీలా, గోవిందా గోవిందా వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాడు..అప్పట్లో తన సినిమాలతో సెపెరేట్ బ్రాండ్ క్రియేట్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు బూతు  సినిమాలు తీసే దర్శకుడుగా మారాడు..అందుకు తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఆర్జీవీ తాజాగా ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు.

ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

ఆర్జీవీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు… ఇటీవల ఈ సినిమా రీరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను చూసిన ఆర్జీవీ ఈ విధంగా రాసుకొచ్చాడు.దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి రెండు రోజుల క్రితం నేను తెరకెక్కించిన సత్య సినిమా చూసాను. చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తలుచుకుంటే నా కంటిలో కన్నీళ్లు ఆగలేదు. సినిమా తీయడం అంటే పసి బిడ్డకు జన్మనివ్వడం లాంటిది. పురిటిలో బిడ్డ ఎలా పురుడుపోసుకుంటుందో సినిమా కూడా అంతే. సినిమా హిట్ అయినా కాకున్నా నేను ముందుకు సాగుతూ వచ్చాను.

2 రోజుల క్రితం సత్య సినిమా చూసి హోటల్‌కు తిరిగి వచ్చి చీకటిలో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందంలో నాకు కన్నీళ్లు వచ్చాయి..’సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయను అనిపించి తెగ ఏడ్చేసాను.ఈ సినిమాను నేను బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని నాకు అనిపించింది.రంగీలా, సత్య వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాక ఆ గర్వంతో నా కళ్లు మూసుకుపోయాయి. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ఆ రెండు సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారం, పొగరుతో నా కళ్లునెత్తికెక్కాయి. మద్యానికి బానిసై తాగుబోతుగా మారాను. సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ నాకు అర్థం కాలేదు. సత్య కారణంగా నన్ను నమ్మిన వారందరికీ నేను చేసిన ద్రోహాలకు నేను ఎంతో  భాదపడ్డానని  ఆర్జివీ ఎంతో ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసారు…చివరగా ఇప్పుడు నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొంత సమయాన్ని సత్య వంటి మంచి సినిమాలు చేయడానికి ఉపయోగిస్తా అని.. ఈ సత్యాన్ని నేను ‘సత్య’ పై ప్రమాణంచేస్తూ చెబుతున్నాను’ అని ఆర్జివీ సంచలన పోస్ట్ చేసారు..

Related posts

డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..?

murali

సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!!

murali

రాజాసాబ్ : టీజర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment