MOVIE NEWS

NC24 : నాగచైతన్య థ్రిల్లర్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్..?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్’.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు..అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందే నాగ చైతన్య నెక్స్ట్ మూవీని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్  దండు నాగచైతన్యతో బిగ్గెస్ట్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు..

వార్ 2 : ఎన్టీఆర్ ఫస్ట్ లుక్, టీజర్ పై బిగ్ అప్డేట్..!!

ఈ బిగ్గెస్ట్ మూవీకి మేకర్స్ క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది..ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది.ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మించబోతున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ ఏడాది ఎండింగ్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఇంకా ఈ మూవీకి మేకర్స్ టైటిల్ ని ఖరారు చేయలేదు.

తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య – కార్తీక్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు ‘వృషకర్మ’ అనే టైటిల్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనేది ప్రశ్నగా మారింది..కార్తీక్ దండు గత చిత్రం ‘విరూపాక్ష’ అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..మరి ఇప్పుడు ‘వృషకర్మ’ అనే ఈ టైటిల్ ప్రేక్షకులలో సినిమాపై బజ్ తీసుకొస్తుందా అని మేకర్స్ చర్చిస్తున్నట్లు సమాచారం..

Related posts

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

పవర్ స్టార్ వీరమల్లు సినిమా నుంచి తప్పుకున్న ఆ స్టార్ రైటర్..!!

murali

డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..?

murali

Leave a Comment