MOVIE NEWS

రాబోయే పదేళ్లలో సుకుమార్ చేసేది కేవలం 3 సినిమాలేనా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది డిసెంబర్ 5 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. పుష్ప 2తో భారీ హిట్ అందుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను గ్లోబల్ స్టార్ రాం చరణ్ తో చేస్తున్నాడు. RC 17గా రాబోతున్న ఈ సినిమా కోసం సుకుమార్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు.

అఖండ 2 : బాలయ్య సినిమాలో అఘోరిగా అలరించనున్న ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..!!

ప్రస్తుతం రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వకముందే రాంచరణ్ దర్శకుడు సుకుమార్ తో తన తరువాత సినిమాను మొదలు పెడతారని తెలుస్తుంది. సుకుమార్ రామ్ చరణ్ తో గతంలో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేశారు. మళ్లీ ఈ బిగ్గెస్ట్ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..ఇదిలా ఉంటే సుకుమార్ చరణ్ సినిమా కోసం ఏకంగా 3 ఏళ్లు సమయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.. కేవలం రాంచరణ్ సినిమానే కాదు ఆ తరువాత తీయబోయే సినిమాలకు సైతం సుకుమార్ 2 నుంచి 3 ఏళ్లు సమయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.. ఈ లెక్కన సుకుమార్ రాబోయే పదేళ్లలో కేవలం 3 సినిమాలు మాత్రమే చేయనున్నట్లు తెలుస్తుంది…

సుకుమార్ ఇదివరకు రెండేళ్లకు ఒక సినిమా తీసేవాడు. ఇప్పుడు రెండు కాస్త 3 ఏళ్లు అయ్యింది. సుకుమార్ హీరోల లిస్ట్ లో రాం చరణ్ తర్వాత విజయ్ దేవరకొండ ఆ తరువాత మహేష్ కూడా ఉన్నారు. అంతేకాదు సుకుమార్ పుష్ప 2 చివర్లో పుష్ప 3 కూడా ఉందని ఫ్యాన్స్ కి  షాక్ ఇచ్చాడు. సో పుష్ప 3 కి కూడా మరో 2 ఏళ్లు కేటాయించనున్నాడు…సుకుమార్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ చూసాక సినిమా లేట్ అయినా భారీ విజయం సాధించడం అయితే పక్కా అని తెలుస్తుంది.. అందుకే ఫ్యాన్స్ కూడా సుక్కు మార్క్ తగ్గకుండా సినిమాలు వస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నారు..

Related posts

టికెట్ రేట్స్ హైక్ లేదు.. బెన్ఫిట్ షో పడేది లేదు..మరి “గేమ్ ఛేంజర్” పరిస్థితి ఏంటి..?

murali

ప్రభాస్ “స్పిరిట్” మూవీలో మెగా హీరో.. వంగా మావ ప్లాన్ అదిరిందిగా..!!

murali

గేమ్ ఛేంజర్ టీజర్‌ వచ్చేది అప్పుడే

filmybowl

Leave a Comment