నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో వున్నాయి.. దీనితో ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద ఘన విజయం సాధించింది..ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కాంబో టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది.
వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ చిత్రం ‘అఖండ 2-తాండవం’ . ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా తాజాగా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. రీసెంట్ గా జరిగిన మహా కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది..ఇటీవల అక్కడ షూటింగ్ గురించి దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ అఘోర పాత్రలతో కూడిన సినిమా కావడంతో ఈ కుంభమేళాలో కోట్ల మంది భక్తుల మధ్య, లక్షల మంది అఘోరాలు, నాగ సాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులను కలిసాం. మా షూటింగ్ లో ప్రయత్న లోపం లేకుండా ‘అఖండ’ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.
పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”ఓజి” రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..?
కానీ కోట్ల మంది జనాల మధ్య షూటింగ్ అంటే అది మామూలు విషయం కాదు.. తన సినిమాలో నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు.’అఖండ 2′ కోసం కూడా కాస్టింగ్ వేట మొదలు పెట్టాడు.ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ నటించనుందని తెలుస్తుంది… ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన శోభన ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందని సమాచారం. అది కూడా ఆమె ఓ సన్యాసిని పాత్రలో నటిస్తుంది అని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో శోభన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని సమాచారం..