పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు వహిస్తూనే వరుస సినిమాలతో బిజీ గా వున్నారు.. ప్రస్తుతం పవన్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..పవన్ నుంచి వచ్చే మొదటి సినిమా “ హరిహర వీరమల్లు “.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన పవన్ రాజకీయాలలో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. ఈ సినిమాకు దర్శకుడుగా పనిచేస్తున్న క్రిష్ సినిమా అంతకంతకు ఆలస్యం అవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నారు.. దీనితో మిగిలిన భాగం షూటింగ్ ని ఆ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నాడు.. మార్చి 28 న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..
దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!!
ఇదిలా ఉంటే పవన్ నటిస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీ “ ఓజి”.. స్టార్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది.. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఓజీ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ పవర్ స్టార్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి నిర్మాత దానయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓజీ సినిమా నిర్మాత DVV దానయ్య తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేడు ఉదయం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “ప్రస్తుతం “ఓజి” సినిమా ప్రొడక్షన్ జరుగుతుంది. కొంత షూటింగ్ మిగిలి ఉంది. త్వరలోనే విడుదలకు సిద్ధం అవు తుంది. త్వరలో “ఓజి” సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం” అని చెప్పుకొచ్చారు.