గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది..అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది..దీనితో బాక్సాఫీస్ వద్ద ‘గేమ్ ఛేంజర్ ‘ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు భారీగా ఖర్చుపెట్టాడు.. గేమ్ ఛేంజర్ బోల్తా కొట్టడంతో దిల్ రాజు పరిస్థితి దారుణంగా మారింది..
బన్నీ, త్రివిక్రమ్ మూవీకి సర్వం సిద్ధం.. అతి త్వరలో గ్రాండ్ అనౌన్స్మెంట్..!!
ఈ ఏడాది సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రం నిలిచింది. ఈ సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా మంచి కలెక్షన్సే అందుకుంది.గేమ్ ఛేంజర్ సినిమాతో ఫైనల్‌గా నిర్మాత దిల్ రాజుకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదు..సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్‌లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గకుండా ఖర్చు చేసారు…గేమ్ ఛేంజర్ సినిమాపై పూర్తి నమ్మకంతోనే దిల్ రాజు కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ దిల్ రాజుకి షాక్ ఇచ్చింది.అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా దిల్ రాజే నిర్మించారు కాబట్టి ఆ సినిమా దిల్ రాజుకి కాస్త ఊరట కలిగించిందని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తుంది… ఆయన బ్యానర్‌లోనే మరో సినిమా చేయాలని రాంచరణ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ భావిస్తున్నట్లు సమాచారం..కొద్దిరోజుల తర్వాత ఈ విషయంపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం వుంది..
‘సినిమాలు తీయడం మానేస్తా’.. సుకుమార్ షాకింగ్ కామెంట్స్..!!