బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత పీక్స్ కి తీసుకెళ్లాడు.. దర్శక ధీరుడు రాజమౌళి టాలెంట్ ని హాలీవుడ్ డైరెకర్స్ సైతం ఎంతగానో మెచ్చుకున్నారు.. ఒక తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చిన ఘనత రాజమౌళిదే.. అంతటి ఘనత సాధించిన రాజమౌళి నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి తన తరువాత సినిమా చేస్తున్నాడు.. రీసెంట్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.”ఎస్ఎస్ఎంబి” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
కల్కి 2898AD : పార్ట్ 2 పై స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన అశ్వినీదత్..!!
అసలు పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబును హీరోగా ఎంచుకొని పాన్ వరల్డ్ సినిమా చేయడం ఒక రకంగా సాహసమనే చెప్పాలి. మరి ఈ సినిమా మీద రాజమౌళి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ వరల్డ్ లో సత్తా చాటాలంటే ముందుగా ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది అల్టిమేట్ గా ఉండాలని రాజమౌళి భావిస్తున్నాడు..అందుకోసమే ఆయన ఈ సినిమాకి అనిరుధ్ తో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పించ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకి సాంగ్స్ ని అందిస్తే అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పించే విధంగా సన్నాహాలు చేస్తున్నారట