పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు “.. ప్రస్తుతం పవన్ లైనప్ లో భారీ సినిమాలే వున్నాయి..హరిహర వీరమల్లు సినిమా మొదలై చాలా కాలం కావడంతో పవన్ ముందుగా ఈ సినిమా పూర్తి చేసే పనిలో వున్నారు.. ఈ సినిమా దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది..అలాగే ఆస్కార్ విన్నర్ ఎం. ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..
ఇదెక్కడి లాజిక్ రా మావ.. దేవర 2 స్టోరీ అదేనా..?
ఇదిలా ఉంటే సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాట మాట వినాలి ప్రొమోను విడుదల చేశారు.పాటను విడుదల చేయకుండా.. ఈ పాటలో ‘వినాలి.. వీర మల్లు మాట చెబితే వినాలి.’ అని పవన్ చెప్పిన డైలాగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి పాటను జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా.. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడడం విశేషం.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
తొలి భాగం హరిహర వీరమల్లు-1 ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా “ఓజి”.. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ ఓ రేంజ్ లో వైరల్ అయింది.. ఈ సినిమా వస్తే మాత్రం ఫ్యాన్స్ ఆపడం ఎవ్వరివల్ల కాదు..