గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డాకూ మహారాజ్’. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన టాక్ తెచ్చుకుంది..ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపం చూపించారు.బాలయ్య తన పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు యాక్షన్ యాక్షన్ తో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ తమన్ అందించిన బీజీఎం.. ఈ బిజిఎం కి బాక్సులు బద్దలు గ్యారెంటీ అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ నీల్ సినిమాపై బిగ్ అప్డేట్..పోస్ట్ వైరల్..!!
అయితే తాజాగా ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ఓ ఉహించని సంఘటన చోటు చేసుకుంది. సినిమాలో తమన్ బీజియంకి నిజంగానే సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. దీంతో థియేటర్ యాజమాన్యం కొద్ది సేపటి వరకు సినిమాను నిలిపివేశారు. ఏపీ రాయలసీమలోని ఆళ్లగడ్డ లో ఉన్న రామలక్ష్మి థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.డాకు మహారాజ్’ సౌండ్ ఎఫెక్ట్స్ కు థియేటర్ లో ఉన్న సౌండ్ స్పీకర్లు పని చేయకపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటూ సినిమాను నిలిపివేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆందోళన చేసారు..
కాసేపటి తర్వాత థియేటర్ యాజమాన్యం యథావిధిగా సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే ఇక్కడి లాగానే చాలా చోట్ల ‘డాకు మహారాజ్’ సౌండ్ ఎఫెక్ట్స్ కు స్పీకర్లు పగిలిపోయానని ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మా సినిమా మ్యూజిక్ కచ్చితంగా థియేటర్ స్పీకర్స్ బద్దాలవుతాయి.. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని తమన్ చెప్పుకొచ్చారు.. బాలయ్య ని చూస్తేనే ఆ రేంజ్ హైప్ వస్తుందని తమన్ చెప్పుకొచ్చారు..
Started speaker's pagilipoyayi anta @MusicThaman anna nuvvu respond avvali anta chusuko konchem 😂#DaakuMahaaraaj pic.twitter.com/xyO0uDrTPK
— suryaDEVARA vamsi (@music_thamania) January 12, 2025