MOVIE NEWS

ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా ఏకంగా 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు.. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలే వున్నాయి.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..అలాగే ఎన్టీఆర్ తన తరువాత సినిమాను కేజీఎఫ్, సలార్ సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరన ప్రారంభం కానుందని సమాచారం..

గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!!

ఇదిలా ఎన్టీఆర్ కి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..సినిమా నటీనటులు జనాల్లోకి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితులు వున్నాయి..వాళ్లు ఎదురు పడితే చాలు సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ వెంటబడుతుంటారు. ఇక స్టార్ హీరోలు కనుక కనిపిస్తే వేలాది మంది జనాలు గుమికూడతారు. అందుకే ఇండస్ట్రీకి చెందిన వారు సాధారణంగా బయటకు వెళ్లాలంటే భయపడతారు…. అయితే ఎన్టీఆర్ తాజాగా వందలాది మంది జనాలు తిరుగుతున్న రోడ్డు మీద కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్‌ రోడ్డు మీద తిరుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినీ ప్రముఖులు రోడ్ల మీద తిరుగుతున్నారంటే అది కచ్చితంగా విదేశాల్లో అయ్యి ఉంటుంది.

ఎన్టీఆర్‌ సైతం విదేశాల్లో రోడ్డు మీద తిరుగుతున్న సమయంలోనే ఈ వీడియోను ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్కాట్లాండ్‌కు చెందిన ఒక సోషల్‌ మీడియా ఇన్ఫ్యూలెన్సర్‌ ఈ వీడియో తీసాడు… అతడు తెలియకుండా తీసిన ఆ వీడియోలో ఎన్టీఆర్‌ కనిపించడంతో చాలా మంది ఆశ్చర్యపోయి తనకు మెసేజ్ చేశారట.స్కాట్లాండ్‌లోని ఫేమస్ ఎడిన్‌బర్గ్‌ క్రిస్మస్ మార్కెట్‌ అందాలను చిత్రీకరిస్తున్న సమయంలో సామాన్యులతో కలిసి ఓ సింపుల్ మ్యాన్ లా ఎన్టీఆర్‌ నడుచుకుంటూ వెళ్తున్నారు.

 

Related posts

పుష్ప 2 రీలోడ్ వెర్షన్.. మరో 20 నిముషాలు అదనంగా.. రిలీజ్ ఎప్పుడంటే..?

murali

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

murali

Nandamuri Bala Krishna : బాక్సులు బద్దలయ్యే అప్డేట్.. ఇక దబిడి దిబిడే!

filmybowl

Leave a Comment