MOVIE NEWS

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..బొమ్మ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ..!!

నందమూరి నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి బిగ్ హిట్స్ అందుకున్న దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజ్‌ ను గ్రాండ్ గా తెరకెక్కించారు..
డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా నటించారు. ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగాగ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?

ఇదిలా వుంటే డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.ప్రముఖ బాలీవుడ్ కాంట్రవర్సియల్ క్రిటిక్ ఉమైర్ సంధు డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు. అయితే, ఓవర్సీస్‌లో డాకు మహారాజ్ సెన్సార్ స్క్రీనింగ్ జరిగినట్లు సమాచారం.అక్కడ వీక్షించిన ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు..”డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్‌టైనర్. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారని ఊర్వశి రౌటెలా సెక్సీ ఐటమ్ సాంగ్ అదిరిపోతుందని.. రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నా కూడా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకున్నాడని ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్” అని ఉమైర్ సంధు ట్వీట్ చేసారు.

.అంతే కాదు ఈ సినిమాకు ఆయన 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు..దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.అయితే ఈ రివ్యూ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు..అసలు ఇంతవరకు సినిమా సౌండ్ మిక్స్‌లే అవ్వలేదు..అంటూ ఉమైర్ సంధుపై కౌంటర్స్ వేస్తున్నారు.

Related posts

గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?

murali

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

ఐకాన్ స్టార్ కి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు..!!

murali

Leave a Comment