గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాంచరణ్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో అన్ స్టాపబుల్ కిరామ్ చరణ్ గెస్ట్ వచ్చారు.. ఈ షో లో చరణ్ తన కెరీర్ కు సంబంధించిన కొన్ని సీక్రెట్లను బాలయ్యతో పంచుకున్నారు.
మెగాస్టార్ అనిల్ రావిపూడి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే..?
ఇక ఈ షోలో బాలయ్య చరణ్ ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు.. నీ కెరీర్ నువ్వు రీగ్రేట్ ఫీల్ అయ్యే సినిమా ఏమైనా వుందా అని అడగ్గా రామ్ చరణ్ బాగా ఫీల్ అయిపోతూ తన కెరీర్ లో ఒక సినిమా విషయంలో భారీ తప్పు చేశానని తెలిపారు..అది ఏంటి అంటే బాలీవుడ్ లో అమితాబచ్చన్ హీరోగా వచ్చిన ‘జంజీర్’ సినిమాని రీమేక్ చేసి తాను తప్పు చేసినట్లు చరణ్ తెలిపారు. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో చాలా రోజుల పాటు ఆ డిప్రెషన్ లో ఉన్నానని చరణ్ తెలియజేశాడు.
జంజీర్ లాంటి ఒక క్లాసికల్ సినిమాని మళ్లీ రీమేక్ చేయాలనుకోవడం పెద్ద తప్పు కానీ రామ్ చరణ్ తనే స్వయంగా అలాంటి తప్పు చేసినందుకు రిగ్రేట్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు…ఆ సినిమా ద్వారా బాలీవుడ్ లో భారీ విమర్శలను ఎదుర్కొన్న రామ్ చరణ్ ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో చేసిన ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో అదే బాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.. ఆ సినిమా సంచలన విజయంతో చరణ్ ‘గ్లోబల్ స్టార్’ గా మారారు..