MOVIE NEWS

పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వీరమల్లు సాంగ్ మరింత లేట్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ హరిహర వీరమల్లు “.. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో మొదలయింది.. కానీ రాజకీయాల్లో పవన్ బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ అంతకఅంతకు ఆలస్యం అవుతూ వచ్చింది.. దీనితో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారు.. అప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకున్న హరిహర వీరమల్లు మిగిలిన భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ తో హరిహర వీరమల్లు బిగ్గెస్ట్ పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది.

డాకు మహారాజ్ : మామ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లుడి ఆగమనం ..?

ఎన్నికల కారణంగా గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఎనిమిది రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని సమాచారం.గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కాగా ఇటీవల హరిహర వీరమల్లు లోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ వెల్లడించారు. జనవరి 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన “మాట వినాలి” అనే సాంగ్ ను ఉదయం 9 గంటల 6 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా మేకర్స్ మరో ప్రకటన విడుదల చేశారు. ఈ పాటను విడుదల చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని వారు వెల్లడించారు. పాటకు సంబంధించి అత్యుత్తమ వెర్షన్‌ని అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని వారు తెలిపారు. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వివరించారు. అయితే అభిమానులు కోరుకున్నట్లు గానే ఈ సాంగ్ ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు..

Related posts

Unstoppable : అకిరా నందన్ సినీ ఎంట్రీ పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?

murali

బాల‌య్య కోరిక‌లు నెరవేరుతున్నాయి

filmybowl

ఎస్ఎస్ఎంబి : మహేష్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

murali

Leave a Comment