MOVIE NEWS

అమ్మో..శంకర్ డ్రీం ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ అందుకున్న దర్శకుడు శంకర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్.. ఇండియన్ 2 తో డిజాస్టర్ అందుకున్న శంకర్ ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నారు..ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదలకానున్న ఈ సినిమా శంకర్‌కు మాత్రమే కాకుండా, దిల్ రాజుకి కూడా ఎంతో ప్రెస్టేజియస్ మూవీ..ఈ చిత్రం కనుక భారీ విజయం సాధిస్తే, శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరికి లైన్ క్లియర్ అయినట్లే అవుతుంది.. ఆ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు సమాచారం..

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

అయితే గేమ్ ఛేంజర్ క్లిక్కయితేనే ఆ సినిమాను ధైర్యంగా స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రముఖ మధురై ఎంపీ ఎస్. వెంకటేశన్ రాసిన వీరయుగ నాయగన్ వేల్పరి పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని, శంకర్ ఈ సినిమాను మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట..చారిత్రాత్మక నేపథ్యం, విజువల్ గ్రాండియర్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుంది..2022లోనే ఈ ప్రాజెక్ట్ పట్ల కొన్ని క్లూస్ కూడా లీక్ కావడం, ఇప్పుడు వాటి నిజానిజాలు స్పష్టమవడంతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి రేపుతోంది.

వేల్పరి ప్రాజెక్ట్‌కి ప్రధాన పాత్ర ఎవరు చేస్తారనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. గతంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చినా కానీ అది కుదరకపోవడంతో మరో ప్రముఖ నటుడిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో సౌత్ స్టార్ హీరోలు కూడా నటించే అవకాశమున్నట్లు తెలుస్తుంది… గేమ్ ఛేంజర్ కనుక భారీ సక్సెస్ సాధిస్తే శంకర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పెన్ స్టూడియోస్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నట్లు సమాచారం..

Related posts

సూపర్ స్టార్ ధనుష్ #D52 మూవీ టైటిల్ ‘ఇడ్లీ కడై’

filmybowl

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

murali

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment