MOVIE NEWS

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్‌. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న
ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంది.

“గేమ్ ఛేంజర్” లో ఆ స్టార్ డైరెక్టర్స్.. ఏంటి మావ శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..?

ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి ఏకంగా 180 ఫ్లస్ మిలియన్స్ వ్యూస్ తో దుమ్ములేపుతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో గుర్రం కంటే వేగంగా రామ్‌చరణ్ పరిగెడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలే ఉండగా.. ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే నేడు రాజమండ్రిలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి.

సాయంత్రం జరగనున్న ఈ వేడుకకు ఇప్పటి నుంచే అభిమానులు భారీగా చేరుకుంటున్నారు… ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. దీంతో రాజమండ్రితో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి మెగా అభిమానులు పెద్ద ఎత్తున ఈ వేడుకకు వస్తున్నారు..ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సునీల్ వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు..

Related posts

ఎన్టీఆర్ తో పాటు సైఫ్ ని పొగిడితీరాల్సిందే

filmybowl

బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

murali

మంచు వారింట్లో మళ్ళీ రచ్చ.. క్లారిటీ ఇచ్చిన పిఆర్ టీం..!!

murali

Leave a Comment