MOVIE NEWS

బన్నికి భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్ట్.. కానీ..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది పుష్ప 2 సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1800 కోట్లు కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. పుష్ప 2 సినిమా ఇంతటి ఘన విజయం సాధించినా కూడా సంధ్య థియేటర్ ఘటన అల్లు అర్జున్ ని మానసికంగా క్రుంగదీసింది..ఆ ఘటన కారణంగా అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో హై కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. తాజాగా మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో అల్లుఅర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు..

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

తాజాగా ఈ కేసులో బన్నికి భారీ ఊరట లభించింది. సంధ్య థియేటర్ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన మళ్లీ జైలుకు వెళ్తారా అనే టెన్షన్ ఆయన అభిమానులను వెంటాడుతూ వచ్చింది.కానీ చివరకు ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ కొన్ని షరతులను కూడా పెట్టింది. రూ.50వేల రెండు పూచీకత్తులపై ఈ బెయిల్ ను కోర్టు ఇచ్చింది. అలాగే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని,పోలీసులకు విచారణ పరంగా పూర్తిగా సహకరించాలని, సాక్ష్యులను ప్రభావితం చేయొద్దంటూ కోర్టు షరతులు విధించింది.దీంతో అల్లు ఫ్యామిలీ, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వెళ్లడమే ఐకాన్ స్టార్ కు ఇబ్బంది అని చెప్పొచ్చు..

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఏ11గా పోలీసులు చేర్చారు. ఇప్పటికే ఆయన అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్ళిరావడంతో ఈ ఇష్యూ చాలా దూరం వెళ్లిపోయింది. ఇక ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి బన్నీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ కేసులో ఇక అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ దొరికినట్లే అని కొందరు న్యాయ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

Related posts

గేమ్ ఛేంజర్ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్.. రిలీజ్ అయిన 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అంటే..?

murali

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

murali

Leave a Comment