MOVIE NEWS

ప్రభాస్ “ది రాజా సాబ్ “.. రిలీజ్ వాయిదా పడుతుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ బిజీగా వున్నాడు . ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ “ది రాజా సాబ్”.. ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు..హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీస్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో ప్రభాస్‌ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలలో సందడి చేయనున్నారు.

అఫీషియల్ : “గేమ్ ఛేంజర్” గ్రాండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న పవర్ స్టార్..!!

ఇప్పటికే మేకర్స్ ఇచ్చిన అప్డేట్స్ తో ఆ విషయంపై ఫ్యాన్స్ కి క్లారిటీ వచ్చేసింది.అయితే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న జాక్ ను కూడా అదే డేట్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో రాజా సాబ్ విడుదల వాయిదా పడుతుందని అంతా అనుకుంటున్నారు..

దీంతో వాయిదాపై నేరుగా స్పందించని మేకర్స్ ఇన్ డైరెక్ట్ గా ఓ పోస్ట్ వేశారు… రాజా సాబ్‌ షూటింగ్ విరామం లేకుండా శరవేగంగా జరుగుతోందని, దాదాపు 80 శాతం పూర్తయిందని తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్ కార్యక్రమాలు అంతే వేగంగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. త్వరలో వరుస అప్డేట్స్‌ ఇస్తామని తెలిపారు..అయితే ఇప్పుడు రాజా సాబ్ టాకీ పార్ట్ కంప్లీట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాలుగు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని సమాచారం.

Related posts

దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు.

filmybowl

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

murali

ఒళ్ళు దగ్గర పెట్టుకో తోలు తీస్తా అంటూ అల్లుఅర్జున్ కి ఏసీపి మాస్ వార్నింగ్..!!

murali

Leave a Comment