MOVIE NEWS

అఫీషియల్ : “గేమ్ ఛేంజర్” గ్రాండ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న పవర్ స్టార్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కొద్ది సేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు.రిలీజ్ అయిన ట్రైలర్ కి రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని యూసఫ్ గూడాలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ ఈవెంట్ కి సీఎం రేవంత్ రెడ్డి ని, మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిధులుగా పిలవాలని కూడా ప్లాన్ చేసారు.

మా దర్శకులందరిలో అసలైన ఓజి ఆయనే..రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

కానీ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా AMB సినిమాస్ లో కేవలం మీడియా ప్రతినిధుల సమక్షంలోనే ఈవెంట్ ని నిర్వహించారు..ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నీ గత ఏడాది డిసెంబర్ 21 న అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించారు.. అక్కడ ఈ ఈవెంట్ కి మంచి స్పందన వచ్చింది.. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఓ భారీ ఈవెంట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు..

ఈ ఈవెంట్ కి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్ గా వస్తున్నట్లు రెండు రోజుల క్రితం దిల్ రాజు స్పెషల్ గా అనౌన్స్ చేసారు.. ఈ ఈవెంట్ కోసం పవర్ స్టార్ నీ కలిసిన దిల్ రాజు ఆ ఈవెంట్ కి గెస్ట్ గా రావడానికి ఒప్పించారు.. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..ఈ నెల 4 వ తేదీన రాజమండ్రిలో జరిగే భారీ ఈవెంట్ కి పవర్ స్టార్ వస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది..

Related posts

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్..!!

murali

మెగాస్టార్ సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!!

murali

Leave a Comment