MOVIE NEWS

అన్ ప్రిడిక్టబుల్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇక పూనకాలే..!!

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించింది.గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు.. తండ్రి,కొడుకుగా రాంచరణ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.

సంధ్య థియేటర్ ఘటన..గేమ్ ఛేంజర్ విషయంలో అలెర్ట్ అయిన దిల్ రాజు..!!

అలాగే ఈ సినిమాలో SJ సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సునీల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మేకర్స్
ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి టీజర్, నాలుగు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. రిలీజయిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్ గా నిలిచాయి… ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ నీ గమనిస్తే..సీఎంకి ఓ IAS ఆఫీసర్ కి మధ్య జరిగే పోరాటంలా కనిపిస్తుంది..

అలాగే ఆ ఆఫీసర్ తండ్రికి గతంలో ఇదే సీఎంతో పోరాటం..ప్రజల కోసం తండ్రి కొడుకులు నిలబడిన తీరు ఈ సినిమాలో దర్శకుడు శంకర్ ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తుంది..బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాలా గేమ్ ఛేంజర్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలోహాస్య బ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్ర పోసించినట్లు తెలుస్తుంది.గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లోని AMB మల్టీప్లెక్స్ లో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.ఆయన చేతులు మీదుగా ఈ ట్రైలర్ నీ లాంచ్ చేసారు..

Related posts

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

murali

పుష్ప 2 : ఆ విషయంలో భారీ రిస్క్ చేస్తున్న సుకుమార్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

పుష్ప 2 : ఐకాన్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రకాష్ రాజ్..!!

murali

Leave a Comment