MOVIE NEWS

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది “ భోళా శంకర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు.. దీనితో మరో భారీ బ్లాక్ బస్టర్ సాధించేందుకు మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ ని భారీ బడ్జెట్ తో తెర కెక్కుతుంది.. ఇదిలా ఉంటే “దసరా” మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల చెప్పిన కథకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ప్రస్తుతం ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు..

చరణ్ ని ఆటపట్టించిన బాలయ్య.. వీడియో వైరల్..!!

కానీ షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశ్వంభరకు మాత్రం అంత బజ్ లేదు..టీజర్ కొచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని చిరంజీవి సీరియస్ గా తీసుకుని మార్పుల గురించి దర్శక నిర్మాతలతో చర్చించారనే టాక్ గతంలోనే వచ్చింది కానీ ఆ తర్వాత విశ్వంభర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అనిల్ రావిపూడితో చేయబోయే మూవీ కూడా ప్రస్తుతం సూపర్ బజ్ తెచ్చుకుంటే విశ్వంభర నుంచి ఏ హడావిడి లేదు. దీని వెనుక వ్యూహాత్మక మౌనం ఉందని మెగా కాంపౌండ్లో వినిపిస్తున్న సమాచారం.

ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని గేమ్ ఛేంజర్ మీద నిలిచేలా చేయాలి. సుదీర్ఘ నిర్మాణం కావడంతో తగ్గిపోయిన బజ్ ని పెంచడం నిర్మాత దిల్ రాజు బృందానికి పెద్ద సవాల్ గా మారింది. అందుకే అమెరికా వెళ్లి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ చేసుకొచ్చారు…ఏపీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గెస్టుగా తీసుకొచ్చి మరో వేడుక కూడా భారీగా చేయబోతున్నారు.అలాగే హరిహర వీరమల్లుకు సైతం బజ్ కోసం భారీ ప్రమోషన్స్ చేయాల్సి వుంది..వీటి కోసమే విశ్వంభర హంగామాని ఇంకా మొదలుపెట్టలేదని సమాచారం.. దర్శకుడు వశిష్ఠ ప్రస్తుతం ఈ సినిమా రీ వర్క్ మీద బిజీగా ఉన్నాడు

Related posts

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

గేమ్ ఛేంజర్ : బిగ్గెస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్..?

murali

7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!!

murali

Leave a Comment