నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “ ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమా తో పాటు సంక్రాంతి సీజన్ లో మరో రెండు బిగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. వాటిలో ఒకటీ గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ నటించిన “ గేమ్ ఛేంజర్ “.. మరొకటి విక్టరీ వెంకటేష్ నటించిన “ సంక్రాంతికి వస్తున్నాం “..ఈ మూడు సినిమాల మధ్య ఈసారి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది.
వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!
2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానుండగా..ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‍స్టాపబుల్ సీజన్ 4 టాక్ షోకు రామ్‍చరణ్ గెస్ట్ గా వచ్చారు. రామ్‍చరణ్ ఎపిసోడ్ షూటింగ్ నేడు (డిసెంబర్ 31) జరిగింది. చెర్రీని రిసీవ్ చేసుకున్న సమయంలో బాలయ్య చెర్రీని ఆటపట్టించాడు..అన్‍స్టాపబుల్ షూటింగ్ కోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‍కు రామ్‍చరణ్ వచ్చారు. బాలకృష్ణ బయటికి వచ్చి ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా..చరణ్ దగ్గరికి వచ్చి “నా సెట్స్‌లోకి నీకు అనుమతి లేదు” అన్నారు. లోపలికి రానివ్వననేలా మాట్లాడారు. వేలు చూపిస్తూ బ్రో అన్నారు. చరణ్ నమస్కారం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. బ్రో స్టైల్‍లో ఇవన్నీ లేవంటూ బాలకృష్ణ కౌగిలించుకున్నారు
తన స్టైల్‍లో చెర్రీతో బాలయ్య సరదా చేశారు. చేతులు కలిపి చరణ్‍తో నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడారు. తన సినిమా ముచ్చట్లు చెప్పారు.సంక్రాంతికి డాకూ మహారాజ్, గేమ్ ఛేంజర్ వస్తున్నాయ్ అని చరణ్ చేయి పట్టుకొని బాలకృష్ణ మంచి జోష్‍తో తెలిపారు..రెండుసినిమాలు భారీ విజయం సాధించాలని బాలయ్య అన్నారు.. ఇండస్ట్రీకి మనం గ్రాండ్ సక్సెస్ ఇవ్వాలని బాలయ్య చరణ్‍తో చెప్పారు. మూడు పువ్వులు, ఆరుకాయల్లా ఇండస్ట్రీ ఉండాలని ఆయన అన్నారు. తప్పకుండా అని చరణ్ బాలకృష్ణ తో అన్నారు. అయితే ఈ క్రేజీ ఎపిసోడ్ లో చరణ్ తో పాటు హీరో శర్వానంద్ కూడా ఈ ఎపిసోడ్‍లో కనిపించనున్నారని సమాచారం.
BRO BRO 👊🏻😂🔥 Fun gather between #RamCharan& #NandamuriBalaKrishna at the sets of #UnstoppableWithNBK 🤩😂🔥🔥🤩🤩🤩
Before Show Banger Fun Started 👌😂#GameChanger @AlwaysRamCharan 👑 pic.twitter.com/cfgPe0Jupf
— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) December 31, 2024