MOVIE NEWS

మెగా vs అక్కినేని.. ఊహించని కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

90 వ దశకంలో టాలీవుడ్‌ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌ ఇండస్ట్రీకి నాలుగు స్థంభాలుగా ఉన్నారు..వీరి నుంచి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. అప్పట్లో ఇప్పుడున్న్నంత ఫ్యాన్ వార్స్ ఏమి లేవు..నలుగురు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ నలుగురి హీరోల సినిమాలు చూసి ఎంతో ఎంజాయ్ చేసే వారు.. నటనలో ఎవరి శైలి వారిదే.. ప్రస్తుతం కూడా ఈ నలుగురు హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రజెంట్ స్టార్ హీరోస్ కి పోటీ ఇస్తున్నారు.. అయితే ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోస్ తో మల్టీ స్టారర్ మూవీ సెట్ అయితే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తునే ఉన్నారు.కానీ ఈ కాంబినేషన్స్ మాత్రం సెట్ కావడం లేదు.

“గేమ్ ఛేంజర్” ఈవెంట్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్.. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్..!!

ఒకప్పుడు ఈ నలుగురు హీరోల ఇమేజ్ కారణంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం సాధ్య పడలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఈనేథ్యంలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ సెట్ అవబోతున్నాయి… ఇప్పటికే తాను, బాలయ్య మల్టీస్టారర్ చేయడానికి సిద్ధం అని తమ కోసం ఒకమంచి స్టోరీ రెడీ చేయమని బోయపాటికి మెగాస్టార్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.అలాగే చిరు, నాగ్‌ కాంబోలో కూడా ఓ మూవీ వస్తే చూడాలని మెగా, అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరితో సినిమా చేయడానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది.

బాలయ్యతో భగవంత్ కేసరి, వెంకీతో ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చేసిన అనిల్ తన తరువాత సినిమా మెగాస్టార్‌తో చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను చిరు, నాగ్ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే నలుగురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన క్రెడిట్ అనిల్ రావిపూడికి దక్కుతుంది..

Related posts

RC16 : చరణ్ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన రత్నవేలు..!!

murali

డాకు మహారాజ్ : “దబిడి దిబిడి” సాంగ్ పై మాస్ ట్రోలింగ్.. ఇలాంటి స్టెప్స్ ఎందుకంటూ షాకింగ్ కామెంట్స్..!!

murali

పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడంటే..?

murali

Leave a Comment