MOVIE NEWS

బాలయ్య సినిమాలో దుల్కర్ ని అందుకే తీసుకోలేదు.. బాబీ షాకింగ్ కామెంట్స్..!!

నందమూరి నటసింహం బాలయ్య గత ఏడాది “ “భగవంత్ కేసరి “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..గత ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయిన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. తెలంగాణ యాసలో బాలయ్య అదరగొట్టాడు.. ఆ సినిమాలో బాలయ్య సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ “శ్రీలీల “ ముఖ్య పాత్ర పోషించింది.. ఇదిలా ఉంటే ఈ ఏడాది బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు.. బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు..

గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే..?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఊర్వశి రౌటెల, చాందిని చౌదరీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు..సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు..అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన డైరెక్టర్ బాబీ, ‘డాకు మహారాజ్’ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు..

ఈ సినిమా మొదలు అయ్యే ముందు ఇందులో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని అప్పట్లో సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగింది.అయితే ఈ సినిమాలో ఆయన ఉన్నాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు..దీనికి బాబీ సమాధానం చెప్తూ ‘ ఇందులో దుల్కర్ సల్మాన్ ని ఒక ప్రముఖ పాత్ర కోసం తీసుకుందాం అని అనుకున్నాము..కానీ కథలో ఆయన పాత్రకి అంత డిమాండ్ లేదు. కథ కి సంబంధం లేకుండా ఆయన క్యారక్టర్ ని ఈ సినిమాలో పెడితే బలవంతంగా ఇరికించినట్టు ఉంటుందని అనిపించింది.. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇద్దరు హీరోలతో సినిమా చేసి ఇప్పుడు మళ్ళీ అలాంటి చిత్రమే ఇస్తే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని అందుకే సెకండ్ హీరో క్యారక్టర్ ని తీసేసాము’ అని డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చాడు..

Related posts

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ బిగ్ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

murali

దేవర సినిమా తో నార్త్ లో పాగా వేసిన ఎన్టీఆర్

filmybowl

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

murali

Leave a Comment