MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది.సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..డిసెంబర్ 31 న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని టాక్ వినిపిస్తుంది.

పొంగల్ సాంగ్ తో అదరగొట్టిన వెంకీ మామ.. ప్రోమో వైరల్..!!

దర్శకుడు శంకర్ కమల్ హాసన్ తో తెరకెక్కించిన ఇండియన్ 2 దారుణంగా ఫ్లాప్ అయింది.దీనితో శంకర్ ‘గేమ్ ఛేంజర్’ ని ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు.కచ్చితంగా రామ్ చరణ్ కెరియర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసాడు… తండ్రి కొడుకులుగా రాంచరణ్ రెండు పాత్రలలో నటించాడు. యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది…

అలాగే తండ్రి పాత్రకి జోడీగా క్యూట్ బ్యూటీ అంజలి నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి క్లూ శంకర్ రివీల్ చేయలేదు.ఈ సినిమాలో అన్ని సాంగ్స్ కియారా తో ఉన్నట్లు చూపించారు..అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అంజలి, రామ్ చరణ్ పై ఒక సాంగ్ ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ ఎంతో స్పెషల్ గా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ శంకర్ తెలిపారు.అందుకే ఆమె పాత్రని పూర్తిగా రివీల్ చేయకుండా సర్ప్రైజింగ్ గా ఉంచుతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో అంజలి పాత్ర ఊహించని మలుపు తిప్పే విధంగా ఉండనున్నట్లు సమాచారం..

Related posts

Pushpa 2: జాన్వీ కపూర్, త్రిప్తి దిమ్రీ అన్నారు కానీ ఇప్పుడు పుష్ప 2 స్పెషల్ సాంగ్ లో ఆ బ్లాక్ బస్టర్ హీరోయిన్….

filmybowl

నేను ఏ తప్పు చేయలేదు..అవన్నీ తప్పుడు ఆరోపణలు.. అల్లుఅర్జున్ షాకింగ్ కామెంట్స్..!!

murali

కంగువ కి 24 ఏంటి సంబంధం అనుకుంటున్నారా ?

filmybowl

Leave a Comment