MOVIE NEWS

తమన్ కి అసలైన అగ్ని పరీక్ష.. మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడా..?

2024 సంవత్సరం లో అతి పెద్ద పండుగ క్రిస్మస్ కూడా అయిపోయింది.. ఇక ప్రేక్షకులంతా సంక్రాంతి సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సీజన్ కి ఈ సారి ఏకంగా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి… వాటిలో రెండు భారీ సినిమాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఆ సినిమాలు ఏవంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ అలాగే నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్..ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ ఉహించని స్థాయిలో రీచ్ ఇంకా తెచ్చుకోలేదు.

డాకు మహారాజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పుష్ప రాజ్..?

ఇదిలా ఉంటే వెంకీ మామ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాకు భీమ్స్ సీసీరోలియో కంపోజ్ చేసిన సాంగ్స్ దూసుకెళ్ళిపోతున్నాయి. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ 50 మిలియన్లు దాటేసి టాప్ ఛార్ట్ బస్టర్ అయ్యింది. ఇది ఒకరకంగా తమన్ కు పెద్ద షాక్ అని చెప్పాలి..ఎందుకంటే బడ్జెట్ పరంగా పెద్దవైన బాలయ్య, చరణ్ కంటే వెంకీ మూవీకి హైప్ వస్తుంది..ఇప్పుడు తమన్ ముందు చాలా సవాళ్లున్నాయి. మొదటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకోవడం. దర్శకుడు శంకర్ గతంలో ఏఆర్ రెహమాన్ తో చేయించుకున్న బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయా సినిమాలకు ప్రాణంగా నిలిచింది. వాటికి ధీటుగా గేమ్ ఛేంజర్ కోసం తమన్ ఎలా కంపోజ్ చేశాడనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది..

ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా గురించి ఇస్తున్న హైప్ మాములుగా లేదు. ఇంటర్వెల్ కు ఇరవై నిమిషాల ముందు నుంచి పేపర్లు విసురుతూనే ఉంటారని ఫ్యాన్స్ ని తెగ ఊరిస్తున్నారు. ఇవి నిలబడాలంటే తమన్ స్కోర్ అద్భుతంగా ఉండాలి..అఖండ, వీరసింహారెడ్డి బీజీఎమ్ ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఎంతో ఫేవరెట్ అని చెప్పొచ్చు.మరి ఈసారి తమన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.. అయితే మాత్రం భీమ్స్ ఎలాంటి హడావిడి లేకుండా తనకొచ్చిన స్టార్ ఛాన్స్ అద్భుతంగా వాడుకుంటున్నాడు

Related posts

డాకు మహారాజ్ : బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇక మాస్ జాతర షురూ..!!

murali

‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!

murali

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

Leave a Comment