MOVIE NEWS

సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. మేకర్స్ ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు..బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా బాలీవుడ్ హాట్ బ్యూటి కియారా అద్వానీ నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.., ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!!

రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ ఇటీవల యూ ఎస్ లోని డల్లాస్ లో “ గేమ్ ఛేంజర్ “ గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ ఈవెంట్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా గెస్ట్ గా వచ్చారు.అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ – అభిమానికి మధ్య జరిగిన ఫన్నీ మూమెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఓ అభిమాని రాంచరణ్ ని తన ఫోన్ లో సెల్ఫీ అడిగాడు.దాంతో రామ్ చరణ్ అభిమాని ఫోన్ తీసుకోని తానే స్వయంగా సెల్ఫీ తీశాడు. ఆ తర్వాత అతనికి ఆ ఫోన్ ఇవ్వడం మర్చిపోయాడు. దాంతో ఈవెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఈ విషయాన్ని గమనించి.. చరణ్ కు వెంటనే సైగ చేశాడు. అప్పటికీ చరణ్ తేరుకొకపోవడంతో ఆ వ్యక్తి చరణ్ ను పక్కకు పిలిచి అభిమాని ఫోన్ మీ దగ్గరే ఉండిపోయిందని చెప్పడంతో అప్పుడు రామ్ చరణ్ వెంటనే అభిమానికి తన ఫోన్ తిరిగి ఇచ్చేశాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Related posts

దేవర ప్రీ-రిచ్లీజ్ ఈవెంట్: జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నలుగురు ఐకానిక్ దర్శకులు స్టేజీ పంచుకోబోతున్నారు.

filmybowl

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..ఏకంగా అన్ని కోట్లా..?

murali

Leave a Comment