MOVIE NEWS

పుష్ప 2 : అదనంగా మరో 20 నిముషాలు.. మేకర్స్ స్ట్రాటజీ అదిరిందిగా..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగిస్తోంది.ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో ఈ సినిమా జోరు మాములుగా లేదు..కేవలం 21 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1700 కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఎన్టీఆర్ తో నెల్సన్ మూవీ మొదలయ్యేది అప్పుడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెంచేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు..తాజా సమాచారం ప్రకారం, ‘పుష్ప 2 సినిమాలో దాదాపు 20 నిమిషాల అదనపు ఫుటేజ్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ కొత్త వెర్షన్ త్వరలోనే థియేటర్లలోకి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా ప్రేక్షకులని మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైమ్ ప్రస్తుతం మూడు గంటల 20 నిమిషాలు.ఇక మేకర్స్ అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తే, రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలకు పెరగనుంది.

ఈ యాడెడ్ సీన్స్ ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చేలా ఉండనున్నట్లు తెలుస్తుంది..ముఖ్యంగా పుష్ప పాత్రకు మరింత ఎలివేషన్ ఇచ్చేలా, క్లైమాక్స్‌ను మరింత గ్రిప్పింగ్‌గా ఉండేలా ఉండబోతున్నాయని సమాచారం..ఈ సీన్స్ ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసమే రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ కొత్త వెర్షన్ ద్వారా ఆడియన్స్‌ను మళ్ళీ థియేటర్లకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఓటీటీలో రిలీజ్ కి ముందే థియేటర్ వసూళ్లను మరింతగా పెంచేందుకు ఇది సరికొత్త స్ట్రాటజీగా ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు

Related posts

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

filmybowl

చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

filmybowl

Leave a Comment