MOVIE NEWS

సంధ్య థియేటర్ ఘటనతో ఐకాన్ స్టార్ లో మార్పు.. ఇకపై ఆ లోగో ఉండదా..?

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు..సినిమాలో చూపించిన మాదిరిగానే అల్లుఅర్జున్ అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అని బన్నీ నిరూపించాడు.. పుష్ప సూపర్ హిట్ అవ్వడంతో సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో “పుష్ప 2 ‘’ తెరకెక్కింది.. దాదాపు మూడేళ్ళ నిరీక్షణ తరువాత ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరాల్ ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

RRR : తారక్ ని కొరడాతో కొట్టిన చరణ్.. వీడియో వైరల్..?

పుష్ప 2 సినిమా తో పాటు ఆ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన రచ్చతో సైతం అల్లుఅర్జున్ ఎంతో పాపులర్ అయ్యాడు..సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన విధానం కానీ పలు వీడియోస్ లో తాను ధరించిన వేషధారణపై కూడా భారీగా విమర్శలు వచ్చాయి. రేవతి కుటుంబంపై స్పందించిన వీడియోలో కూడా పుష్ప బ్రాండ్ గొడ్డలి వున్న హూడి వేసుకోవడంతో అక్కడ కూడా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోట్ చేసుకుంటున్నాడు అని చాలా మంది కామెంట్స్ చేసారు..ఇదే కాకుండా తాను జైలు నుంచి వచ్చాక కూడా ఐకాన్ స్టార్ అనే టి షర్ట్ వేసుకొని కనిపించడంపై బన్నీ పై పలు విమర్శలు వచ్చాయి….

అయితే లేటెస్ట్ గా విచారణ కొరకు అల్లు అర్జున్ రెండో సారి పోలీస్ స్టేషన్ కి వెళ్లినప్పటి నుంచి బన్నీ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి..తాను రెండోసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళినపుడు అల్లు అర్జున్ ఎలాంటి లోగోలు లేని ప్లైన్ టి షర్ట్స్‌లోనే కనిపించడం టాపిక్ గా మారింది.అలాగే సోషల్ మీడియాలో తన నుంచి ఏ అనౌన్సమెంట్ వచ్చినా తన అల్లు అర్జున్ లోగో ‘AA’ తప్పకుండా ఉండేది… కానీ క్రిస్మస్ విషెస్ చెబుతూ అల్లుఅర్జున్ షేర్ చేసిన వీడియోలో ఆ లోగో మిస్ అయింది.. దీనితో ఆర్మీ పదం బన్నీని బాగా డిస్టర్బ్ చేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

Related posts

బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..?

murali

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?

murali

Leave a Comment