గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు…ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. ఎస్. జె. సూర్య, సునీల్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..మెగా ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని మేకర్స్ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..
నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!!
రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ రానుంది.. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలని గేమ్ ఛేంజర్ మేకర్స్ చెబుతున్నారు.ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా అన్నీ సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఈ సినిమాకు తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. అలాగే లక్నోలో గ్రాండ్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌ను డిసైడ్ చేసే అసలు సిసలైన ట్రైలర్ రాబోతోందని సమాచారం. మెగా ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచాలంటే కచ్చితంగా పవర్ఫుల్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలి. ఇప్పటికే ట్రైలర్ కట్ వర్క్ జరుగుతోందని సమాచారం..
డిసెంబర్ 27న ఈ ట్రైలర్ ని లాంచ్ చేయాలని మేకర్స్ భావించినా ఎందుకో వాయిదా వేశారు.అయితే డిసెంబర్ 30న హైదరాబాద్ వేదికగా భారీ ఈవెంట్ ఉండొచ్చు అని సమాచారం. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.జనవరి మొదటి వారంలో మేకర్స్ ఏపిలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు తెలుస్తుంది… ఈ రెండు భారీ ఈవెంట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..