MOVIE NEWS

అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!

యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.. జాతిరత్నాలు సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాను పి. మహేష్ తెరకెక్కించారు.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. కానీ కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేదు..అయితే ఆ సినిమా తరువాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు.

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

గ్యాప్ రావడం వెనుక బలమైన కారణం కూడా వుంది..చిన్న యాక్సిడెంట్ కారణంగా నవీన్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.అయితే ఎట్టకేలకు తనదైన టైమింగ్ తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న “అనగనగా ఒక రాజు”మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.నిజానికి ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించారు..కొన్నేళ్ల క్రితం శ్రీలీల హీరోయిన్ గా మరో దర్శకుడితో అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి డైరెక్షన్ బాధ్యతలు “మారి” చేతికి వచ్చాయి.. అయితే ఈ గ్యాప్ లో హీరోయిన్ కూడా చేంజ్ అయింది.. హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరిని మేకర్స్ ఫైనల్ చేసారు..

తాజాగా ఇవాళ ఈ సినిమా టీజర్ వచ్చేసింది.అంచనాలకు తగ్గట్టే నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. టీజర్ ఎంతో ఫన్నీ గా కట్ చేసిన మేకర్స్ విడుదల తేదీ మాత్రం చెప్పలేదు.. అయితే ఈ సినిమాను 2025లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు..వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్న నాగవంశీ అనగనగ ఒక రాజు సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు..

Related posts

బన్నీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన న్యాచురల్ స్టార్..!!

murali

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

ఆ టాలెంటెడ్ దర్శకుడికి దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడట

filmybowl

Leave a Comment