MOVIE NEWS

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ ప్రగ్యజైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా..శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు..

“గేమ్ ఛేంజర్” పట్టించుకోవట్లేదుగా..ఇంకా పుష్ప రాజ్ దే హవా..!

ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో.. సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ జోరు పెంచారు.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా డాకు మహారాజ్ మూవీ టీం నిర్వహించిన ప్రెస్‌మీట్ లో నిర్మాత నాగ వంశీ సినిమా ట్రైలర్ ను జనవరి 2న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా రన్ టైం పై ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది…

తాజా సమాచారం ప్రకారం డాకు మహారాజు ఫైనల్ రన్ టైం మేకర్స్ లాక్ చేశారట.ఈ సినిమాకు 2 గంటల 24 నిమిషాల్లో ఫైనల్ కట్ పూర్తయిందని. టైటిల్ క్రెడిట్, హెల్త్ వార్నింగ్ మెసేజ్‌లన్నిటినీ కలుపుకొని సినిమా 2 గంటల 40 నిమిషాలు ఉండబోతుందని సమాచారం.అయితే ఈ విషయంపై మేకర్స్ ఇప్పటి వరకు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. బాలయ్య ఈ సినిమాలో కూడా డబల్ షేడ్స్‌ లో సరికొత్త లుక్స్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి..

Related posts

బిగ్ బ్రేకింగ్ : అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..!!

murali

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

murali

3D వెర్షన్ లో రిలీజ్ అయిన పుష్ప2. ఎక్కడో తెలుసా..?

murali

Leave a Comment