గత రెండు నెలలుగా పుష్ప రాజ్ ఫీవర్ తో దేశం ఊగిపోతుంది.. ఎక్కడ చూసిన అల్లుఅర్జున్ పుష్ప సినిమా గురించే చర్చ. నేషనల్ మీడియా సైతం అల్లు అర్జున్ న్యూసే కవర్ చేస్తుంది… సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కాంట్రవర్సీ, లేదంటే ‘పుష్ప 2’ కలెక్షన్స్ గురించే చర్చ…పుష్ప 2 రిలీజ్ కి ముందు వున్న క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతుందటంతో రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి అయోమయంగా మారింది..గేమ్ ఛేంజర్ మూవీకి పుష్ప రాజ్ తలనొప్పిగా మారాడు.
‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!!
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బిగ్గెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’.. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఇప్పటికే మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక రీసెంట్ గా అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్ ను కూడా నిర్వహించి ప్రమోషన్లలో జోరు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘ధోప్’ అనే సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ కాంట్రవర్సీ గురించే చర్చ నడుస్తోంది.
పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న ‘గేమ్ ఛేంజర్’కి ఇదే పెద్ద సమస్యగా మారింది. సోషల్ మీడియాలో సైతం ‘పుష్ప 2’ మూవీ, సంధ్య థియేటర్ ఇష్యూ గురించే మీమ్స్ నడుస్తున్నాయి..సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఎవరిది తప్పు అని చర్చించుకోవడంలో అందరూ బిజీ అయిపోయారు.. అయితే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కి ఇంకా రెండు వారాలు టైం ఉన్నప్పటికీ మూవీ గురించి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.. శంకర్ తెరకెక్కించిన “ ఇండియన్ 2 “ ప్లాప్ కావడంతో గేమ్ ఛేంజర్ పై ఎంత హైప్ ఇచ్చిన అది వర్కౌట్ కావడం లేదు.. మరీ ఈ వారంలో అయినా గేమ్ ఛేంజర్ పై బజ్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి..