MOVIE NEWS

‘భారతీయుడు 3’ పై భారీ అంచనాలు.. శంకర్ ని నమ్మిన ప్రేక్షకులు..!!

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన “ భారతీయుడు” సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆ సినిమాలో కమలహాసన్ గెటప్ కానీ, నటన కానీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది..సామాజిక సందేశం ఇచ్చిన ఈ సినిమాకు దాదాపు 28 ఏళ్ల తరువాత దర్శకుడు శంకర్ సీక్వెల్ తెరకెక్కించారు.. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు సీక్వెల్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు..

వెనక్కి తగ్గిన పుష్ప రాజ్.. ఆ సాంగ్ యూట్యూబ్ నుంచి తొలగింపు..!!

కొన్ని వివాదాల మధ్య ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి కొన్నాళ్ళకు మొదలైంది.. దీనితో దర్శకుడు శంకర్ నిలిచిపోయిన సినిమా ఆఘమేఘాల మధ్య పూర్తి చేసి రిలీజ్ చేసారు..ఈ ఏడాది జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ అయిన భారతీయుడు 2 సినిమా ఊహించని డిజాస్టర్ గా నిలిచింది.. శంకర్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ మూవీగా ఈ సినిమా నిలిచింది.. ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటించారు.. ముందుగా ఈ సినిమాను ఒకే పార్ట్ గా తెరకెక్కించాలని అనుకున్నారు.. బిజినెస్ పెరుగుతుందనే ఉద్దేశంతో పార్ట్ 2,పార్ట్ 3 గా సెపెరేట్ చేసి ముందుగా పార్ట్ 2 ని మేకర్స్ రిలీజ్ చేసారు..

కథ ఏమి లేని పార్ట్ 2 మూవీ డిజాస్టర్ గా నిలిచింది.. అసలు కథ అంతా పార్ట్ 3 లోనే వుంది. అందుకే పార్ట్ 3 పై కమల్ హాసన్,శంకర్ ఎంతో నమ్మకంగా వున్నారు.. పార్ట్ 2 రిజల్ట్ చూసాక మేకర్స్ పార్ట్ 3 ని డైరెక్టర్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.. కానీ పార్ట్ 3 థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని శంకర్ తాజాగా ప్రకటించారు.. పార్ట్ 3 కచ్చితంగా ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చారు.. దీనితో పార్ట్ 3 పై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.. ఈ పార్ట్ 3 లో కాజల్ ముఖ్య పాత్రలో నటించింది.. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కానుంది…

Related posts

డాకు మహారాజ్ : ఫస్ట్ సింగిల్ లోడింగ్ ఎప్పుడంటే..?

murali

ప్రభాస్ కోసం మరో ‘లెజెండరీ యాక్టర్ ని తీసుకొస్తున్న మైత్రి మూవీ మేకర్స్

filmybowl

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

Leave a Comment