MOVIE NEWS

3D వెర్షన్ లో రిలీజ్ అయిన పుష్ప2. ఎక్కడో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన నటించిన ‘పుష్ప 2‘ డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి పుష్ప 2 సినిమా అదరగొట్టింది..ఇదిలా ఉంటే తాజాగా 3D వెర్షన్ తో కూడా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి పుష్ప 2 సిద్ధమవుతోంది. బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టే దిశగా పుష్ప 2దూసుకుపోతోంది.నార్త్ బెల్ట్ లో ఈ సినిమా రూ.700 కోట్లు వసూలు చేసింది. దీంతో నార్త్ లో ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి…

RC16 : చరణ్ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన రత్నవేలు..!!

హిందీ ఆడియన్స్‌ ఈ సినిమాను మరింత ఎంజాయ్‌ చేసేలా ఇప్పుడు మేకర్స్ త్రీడీ వెర్షన్‌ దింపారు.వాస్తవానికి ఈ సినిమాన్నీ మొదట ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు… కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మేకర్స్ ఈ సినిమాను త్రీడీలో విడుదల చేయలేకపోయారు. తాజాగా హిందీ భాషలో త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ బాలీవుడ్‌ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అభినందనలు తెలిపింది.అల్లు అర్జున్‌, రష్మిక ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ థాంక్స్‌ కూడా చెప్పారు.

పాత రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతోంది. ఎన్నో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నందుకు ‘పుష్ప2′ టీమ్‌కు అభినందనలు. ఇది ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.అల్లుఅర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ కి దూరంగా వుంటున్నారు ..సంధ్య థియేటర్ ఘటనతో అల్లుఅర్జున్ ఎలాంటి ఫంక్షన్స్ అటెండ్ అవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే త్రివిక్రమ్ తో తన తరువాత సినిమాను అల్లుఅర్జున్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం..

Related posts

పవర్ స్టార్ సరసన రంగమ్మత్త.. క్రేజీ ఆఫర్ దక్కించుకుందిగా..?

murali

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

murali

‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌….

filmybowl

Leave a Comment