గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరీ 10 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి థియేటర్‌లలో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా చరణ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ మెగా ఫ్యాన్స్ ఎంతో ధీమాగా ఉన్నారు. శంకర్ మార్క్ బిగ్గెస్ట్ పొలిటికల్ డ్రామాగా గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!!
ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఒక వైపు గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటూనే మరో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో తన తరువాత సినిమాను చేస్తున్నాడు. చరణ్ తో మూవీ కోసం దాదాపు ఏడాది పాటు వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు ఇటీవలే RC16 షూటింగ్ ప్రారంభించారు. మొదటి షెడ్యూల్‌లో రామ్ చరణ్ పాల్గొన్నారు. షూటింగ్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతుంది. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ లీక్ చేశారు. రామ్ చరణ్‌తో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నట్లుగానూ ఆయన ట్వీట్ చేసారు.
రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని రత్నవేలు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మైసూర్‌లో ఈ సినిమా నైట్ షూట్స్ కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ ఆ షూట్‌లో పాల్గొన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బుచ్చిబాబు, చరణ్ సినిమా షూటింగ్ గురించి రత్నవేల్ అప్డేట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
During #RC 16 shoot in Mysore …
Exciting to collaborate with @AlwaysRamCharan bro after Rangasthalam 🔥@BuchiBabuSana @arrahman @RathnaveluDop @vriddhicinemas @MythriOfficial @SukumarWritings pic.twitter.com/zxd4sRwmO3— Rathnavelu ISC (@RathnaveluDop) December 24, 2024