MOVIE NEWS

రేవతి భర్తకు ఉద్యోగం.. దిల్ రాజు కీలక వ్యాఖ్యలు.. వైరల్..!!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఇష్యూ దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ ఆ సక్సెస్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాడు..సంధ్య థియేటర్ ఘటన అల్లుఅర్జున్ కెరీర్ కి మాయని మచ్చలా మిగిలింది. అల్లుఅర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హై కోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా వున్నారు.. అసెంబ్లీ లో సైతం ఈ విషయంపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసారు..

“దమ్ముంటే పట్టుకోరా షేకావత్” థీమ్ సాంగ్ అదిరిపోయిందిగా..!!

రేవతి కుటుంబానికి పుష్ప 2 నిర్మాతలు అండగా ఉంటామని హామీ ఇస్తూ 50 లక్షల చెక్ కూడా అందజేశారు..దీనితో అల్లుఅర్జున్ విషయంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఎవరూ కూడా అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు..ఇదిలా ఉంటే ఈ ఘటనపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ స్పందించాడు. శ్రీతేజ్ ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. రేవతి కుటుంబాన్ని తాము అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.సమస్యను పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తానని దిల్ రాజు తెలిపారు… అల్లు అర్జున్ ని కూడా కలుస్తానని శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు దిల్ రాజు తెలిపారు.

ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం.శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మన ముందుకు వస్తాడని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు… అలాగే బాధితురాలు రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఎదైనా ఉద్యోగం ఇప్పిస్తామన్నాని అన్నారు.fdc ఛైర్మన్ గా ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీకి మధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని దిల్ రాజు తెలిపారు. ప్రభుత్వం తరఫున సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశామని,ఆయన సానుకూలంగా స్పందించారని దిల్ రాజు చెప్పారు..

Related posts

ఫ్యాన్స్ తో కలిసి “పుష్ప 2” చూడబోతున్న ఐకాన్ స్టార్..!!

murali

పుష్ప – 2 : రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళే

filmybowl

OG పెద్ద రేంజ్ హిట్ అవుతుంది – ఎస్ ఎస్ థమన్

filmybowl

Leave a Comment