ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2′ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా 1500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.. అయితే రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు బన్నీకి మద్దతు ఇస్తూ పోస్ట్‌లు కూడా చేసారు.. అంతే కాదు బన్నీ బెయిల్ పై విడుదలయి ఇంటికి రాగా చాలా మంది సెలెబ్రేటీస్ బన్నీని పర్సనల్ గా కలిసి పరామర్శించారు..
మెగాస్టార్ సినిమాపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!!
అయితే ఆ సమయంలోనే కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా బన్నీ విషయంలో పోలీసుల తీరును ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టారు. తాజాగా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తాజాగా వీడియో విడుదల చేశారు. ఆయన ప్రెస్‌మీట్ తర్వాత రాహుల్ రామకృష్ణ పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది..’ఆరోజు జరిగిన ఘటనపై నాకు సరిగ్గా సమాచారం లేదు.అందుకే ఆరోజు నేను ప్రభుత్వం, పోలీసులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని రాహుల్ అన్నారు.
దీనికి నెటిజన్స్ స్పందిస్తూ.. ‘మీరు. నిజం వైపు నిలబడినందుకు చాలా సంతోషం అన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ ఆ కామెంట్‌ను లైక్ చేసి ఆ నెటిజన్‌కు థాంక్స్ చెప్పారు.అయితే బన్నీ విషయం మాత్రం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ విషయాన్నీ కొంతమంది రాజకీయంగా వాడుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా మారింది.. పుష్ప సినిమాతో ఎంతో కస్టపడి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బన్నికి సంధ్య థియేటర్ ఘటన పాన్ ఇండియా ఎత్తు నుండి ఒక్కసారిగా కింద పడేసింది..అందుకే కష్టం వచ్చిన నష్టం వచ్చిన మనిషి తన తీరు మార్చుకోకూడని అంటారు.. బన్నీకి భారీ ఫ్యాన్స్ సపోర్ట్ వున్నా ఇప్పుడు ఆయనకీ అదే చాలా ఇబ్బందికరంగా మారింది..
I was terribly uninformed about all the events that took place.
I take back my statements that I made previously.— Rahul Ramakrishna (@eyrahul) December 22, 2024