ఒక స్టార్ హీరో సినిమాకి బాగా హైప్ తేవాలంటే నిర్మాత నాగవంశీని నుంచి ఎవరు ఉండరని చెప్పాలి ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ నెటిజన్స్ కి సరికొత్త స్టఫ్ ఇస్తూనే వుంటారు.. గతంలో వచ్చిన గుంటూరు కారం విషయంలో కానీ లేక రీసెంట్ గా బ్లాక్ బస్టర్ అయిన దేవర విషయంలో కానీ నిర్మాత నాగ వంశీ చేసిన కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాపై నిర్మాత నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు..
నాగవంశీ నిర్మాతగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మూవీ “ డాకు మహారాజ్“.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన ఈ బిగ్గెస్ట్ మాస్ మూవీని స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించారు..ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో మేకర్స్ బిగ్గెస్ట్ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ తాజాగా చెప్పారు.దర్శకుడు బాబీ గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. గతేడాది సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.అయితే బాబీ.. ‘వాల్తేరు వీరయ్య’ కంటే ‘డాకు మహారాజ్’ సినిమాని బాగా తీశారని నిర్మాత నాగవంశీ తాజాగా చేసిన కామెంట్స్ చిరంజీవి ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తుంది..
బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..?
ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ తనని తిట్టుకున్నా పర్లేదని ఆయన స్టేట్‌మెంట్ కూడా ఇవ్వడం గమనార్హం.ప్రస్తుతం నాగవంశీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి… నిర్మాత మాత్రమే కాదు గతంలో దర్శకుడు బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు-బాలయ్యతో సినిమాలు చేయడం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. చిరంజీవి గారు స్ట్రిప్ట్ గురించి నాతో డిస్కస్ చేస్తారని కానీ బాలయ్య మాత్రం తాను చెప్పింది ఫాలో అయిపోతారని తెలిపారు..ఇప్పుడు వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..