MOVIE NEWS

డాకు మహారాజ్ : సెకండ్ సింగిల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే అన్ స్టాపబుల్ టాక్ షో లో హోస్ట్ గా అదరగొడుతున్నారు.ప్రస్తుతం బాలయ్య తన 109వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు.. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు..హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు… ఈ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

“డాకు మహారాజ్” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది . ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను రిలీజ్ డేట్ ను నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ఈ నెల 23న “చిన్ని” అనే సాగే లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డల్లాస్ లో జనవరి 4న మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా తరువాత బాలయ్య తన తరువాత సినిమాను బోయపాటి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే..గతంలో వారి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా “అఖండ తాండవం “ సినిమా తెరకెక్కుతుంది.

Related posts

మున్నా భాయ్ 3 వచ్చే టైమ్ ఆసన్నమైంది – రాజ్ కుమార్ హిరాని

filmybowl

లైగర్ కష్టం ఎక్కడకి పోలేదు….

filmybowl

ఐకాన్ స్టార్ పుష్ప 2 పై రోజా మాస్ రివ్యూ అదిరిపోయిందిగా..!!

murali

Leave a Comment