MOVIE NEWS

రిలీజ్ కి ముందే రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్ “..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “..స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా , గ్రాండ్ గా నిర్మిస్తున్నారు .. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ సైతం ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎస్. జె. సూర్య, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..

పవన్ కోసం మళ్ళీ రంగంలోకి రమణ గోగుల..?

ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న తెలుగు, తమిళ, హిందీ భాషల్లోగ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. అయితే సినిమా రిలీజ్ కంటే ముందే రామ్ చరణ్ అనేక రికార్డులు బద్దలు కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అమెరికా బయలుదేరి వెళ్లారు. తాజాగా రామ్ చరణ్ కటౌట్ ఒకటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అదేంటంటే విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు.

బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్ లో 250 అడుగుల భారీ  రామ్ చరణ్ కటౌట్ ని లాంచ్ చేయబోతున్నారు.ఇది ఇండియాలోనే లార్జెస్ట్ కటౌట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు దాదాపు 230 ఫీట్లతో రికార్డు ఉండేది. దాన్ని మరో 20 అడుగులతో రాంచరణ్ కటౌట్ బ్రేక్ చేసింది.’గేమ్ చేంజర్’ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..

Related posts

ముదురుతున్న తొక్కిసలాట వివాదం.. అల్లుఅర్జున్ ట్వీట్ వైరల్..!!

murali

బేబమ్మ ఆశలన్నీ వాళ్ళ మీదే..!

filmybowl

పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..?

murali

Leave a Comment